
ఏకలవ్య భవన నిర్మాణం కోసం..
నగరంలో ఏకలవ్య భవనం నిర్మించాలని ఏపీ గురుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ శివ కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు, సమావేశాలు చేపట్టాలంటే ఇబ్బందిగా ఉందని, అందుకోసం ప్రత్యేకమైన ఏకలవ్య భవనాన్ని నిర్మించాలని కోరారు. స్థలాన్ని కేటాయించినా భవన నిర్మాణాన్ని తామే చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి బుజ్జయ్య, చైర్మన్ కట్టా రామారావు, సలహాదారులు కట్టా రమణయ్య, ఉపాధ్యక్షులు నల్లగొండ్ల వెంకయ్య, దేవరకొండ చిన్నోడయ్య, కట్టా కాటయ్య ఉన్నారు.