కారుణ్య నియామకాలు | - | Sakshi
Sakshi News home page

కారుణ్య నియామకాలు

Jul 1 2025 3:58 AM | Updated on Jul 1 2025 3:58 AM

కారుణ

కారుణ్య నియామకాలు

నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కొండలరావు, చైతన్య ప్రకాష్‌లకు సోమవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు నియామాక ఉత్తర్వులు అందజేశారు.

డీఆర్వో బదిలీ

నెల్లూరు (అర్బన్‌): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా పనిచేస్తున్న ఉదయభాస్కర్‌రావును బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆయన్ను అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్‌లోని రెవెన్యూ శాఖలో ప్రభుత్వ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమించింది. రెగ్యులర్‌ డీఆర్వోను నియమించేంత వరకు ఎఫ్‌ఏసీ డీఆర్వోగా అర్హత గల వారిని కలెక్టర్‌ నియమించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డీపీటీఓగా ఎస్‌కే షమీమ్‌

నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా ప్రజా రవాణా శాఖ (డీపీటీఓ) అధికారిగా ఎస్‌కే షమీమ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీపీటీఓగా విధులు నిర్వహిస్తున్న మురళీబాబు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరులోని డిప్యూటీ సీటీఎంగా విధులు నిర్వహిస్తున్న షమీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె స్థానంలో శృంగవరపుకోట డిపో మేనేజర్‌ రమేష్‌ను ఉద్యోగోన్నతిపై నెల్లూరు డిప్యూటీ సీటీఎంగా బదిలీ చేశారు.

వాకాటి సోదరులకు నోటీసులు

పొదలకూరు: పట్టణానికి చెందిన వాకాటి సోదరులు, వైఎస్సార్‌సీపీ నేతలు శ్రీనివాసులురెడ్డి, శివప్రసాద్‌రెడ్డిలకు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం నోటీసులను జారీ చేసినట్లు ఎస్సై హనీఫ్‌ తెలిపారు. రుస్తుం మైన్‌ కేసులో నిందితులుగా చేర్చిన క్రమంలో అక్రమ కేసుల ఒత్తిడితో కొంతకాలంగా అజ్ఞానంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. సోమవారం సాయంత్రం లోగా విచారణ హాజరు కావాలని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు.

సర్వేయర్లకు

కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ

నెల్లూరు (అర్బన్‌): సచివాలయాల పరిధిలోని 291 మంది సర్వేయర్లకు సోమవారం నగరంలోని ఆ శాఖా కార్యాలయంలో ఏడీ నాగశేఖర్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టారు. బదిలీలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంక్‌ ప్రకారం కాకుండా సిఫార్సు లేఖలపై బదిలీ చేయడంతో తమకు అన్యాయం జరిగిందని పలువురు సర్వేయర్లు విచారం వ్యక్తం చేశారు.

కారుణ్య నియామకాలు 
1
1/2

కారుణ్య నియామకాలు

కారుణ్య నియామకాలు 
2
2/2

కారుణ్య నియామకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement