
సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ఎన్నికలకు ముందు కూటమి నేతల హామీ మేరకు భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని భవన నిర్మాణ కా ర్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు డిమాండ్ చేశారు. మినీ బైపాస్‌లోని పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘ నగర మహాసభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డును 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేశారని, దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం 34 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా పెంచలయ్య, శ్రీనివాసులు, ట్రెజరర్‌గా సంపూర్ణమ్మ ఎన్నికయ్యారు. సీఐటీయూ నెల్లూరు నగరాధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చాన్‌బాషా, అల్లాడి గోపాల్, సీఐటీయూ నేతలు కొండా ప్రసాద్, మూలం ప్రసాద్, కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.