
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పొగతోటలోని రాయ్ చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న అండర్ – 15 సబ్ జూనియర్స్ బాలుర, బాలికల జిల్లా స్థాయి చెస్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. యడవల్లి సాయిచక్రధర్, సంజన గెలుపొందారు. బాలుర విభాగంలో యజ్ఞేశ్వర్‌రెడ్డి, శ్రీచైతన్య, మిథిలేష్.. బాలికల విభాగంలో నేహా, సుదీక్ష, కీర్తన తర్వాతి స్థానాల్లో నిలిచారు. విశాఖపట్నంలో వచ్చే నెల 12, 13న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లో జిల్లా తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. బహుమతులను కళాలయ డైరెక్టర్ గూడూరు లక్ష్మి, ఆనం పద్మనాభరెడ్డి అందజేశారు. ఆర్బిటర్ మౌనిక, విష్ణు, సుబ్బారెడ్డి, ఫిడే ఇన్‌స్ట్రక్టర్ అజీజ్ పాల్గొన్నారు.