
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో గల వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే పలు విభాగాల ఉద్యోగులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్‌ను కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఉదయం తొమ్మిదింటికే ఆయా సచివాలయాల ఉద్యోగులు 1266 మంది హాజరయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం.. అందులో నియామక తేదీల్లో మార్పులుండటంతో గందరగోళం నెలకొంది. ఇవి తప్పులతడకగా ఉండటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ కంటే వెనుక చేరిన వారి పేర్లు కౌన్సెలింగ్‌లో ముందు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కౌన్సెలింగ్‌కు ఉద్యోగులు సహకరించారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడారు. వార్డు సచివాలయ విభాగం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశామని, ఉద్యోగులకు వార్డుల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని వెల్లడించారు.
హాజరైన 1266 మంది సచివాలయ ఉద్యోగులు
నియామక తేదీల్లో తప్పులతో
గందరగోళం

ముగిసిన బదిలీల కౌన్సెలింగ్