
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు సిటీ: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్స్ కాలనీలోని బిట్ – 2లో నివాసం ఉంటున్న ఖతీముద్దీన్ (40), నూర్జ్‌హాన్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉడ్ కాంప్లెక్స్‌లో కొయ్య పని చేసేవారు. మూడు నెలలుగా పనిలేకపోవడంతో కుటుంబపోషణకు అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలని రోజూ వేదనకు గురయ్యేవారు. కుమార్తె వివాహానికి సరిపడా డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో భార్య తన పిల్లలతో కలిసి బెడ్‌రూమ్‌లో శుక్రవారం రాత్రి నిద్రించారు. హాల్లోకి శనివారం వచ్చి చూడగా, సీలింగ్ ప్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. భార్య కేకలేయడంతో చుట్టుపక్కలు వారు వచ్చి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేదాయపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.