
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి
● ఎమ్మెల్సీ తలశిల రఘురామ్
పొదలకూరు : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ అభయమిచ్చారు. పొదలకూరులోని జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ నివాసంలో శనివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయ పరుచుకుని సమస్యలు ఎదురైతే పోరాడాల్సిందిగా సూచించారు. వెన్నుదన్నుగా తాము నిలబడతామన్నారు. మాజీమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజిత మాట్లాడుతూ తన తండ్రి త్వరలోనే కేసుల నుంచి బయటకు వస్తారని, నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో పార్టీ స్టేట్ సెక్రటరీ శివశంకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు, వెంకటాచలం వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, కోదండరామిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు జీ లక్ష్మీకల్యాణి, ఎస్‌కే అంజాద్, జీ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.