
జాయింట్ ఎల్‌పీఎం పూర్తికి ప్రత్యేక డ్రైవ్
3,680 కొత్త పింఛన్లు మంజూరు
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలు 3,680 మందికి కొత్త పింఛన్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబరు నుంచి పింఛన్ తీసుకుంటూ మరణించిన వ్యక్తుల భార్యలకు కొత్తగా పింఛన్ మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 1వ తేదీ పాత పెన్షన్‌తోపాటు కొత్తగా మంజూరైన వారికి కూడా పింఛన్ నగదు అందిస్తామని తెలిపారు. అనంతరం డీఆర్‌డీఏలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని అందించారు. దానికి సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
● జేసీ కార్తీక్
నెల్లూరు రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి అవసరమయ్యే జాయింట్ ఎల్‌పీఎం (జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్) పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జేసీ కె. కార్తీక్ రెవిన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కావలి, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లతో రీసర్వే, డిజిటలైజేషన్, హౌసింగ్, సీసీఆర్‌డీ కార్డులు, సిటిజన్ సర్వీసెస్ తదితర రెవెన్యూ సంబంధిత విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రెండో విడత ఎంపికై న గ్రామాల్లో రీసర్వే సక్రమంగా పూర్తి చేయాలని, ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తలెత్తిన సమస్యలను పరిగణలోకి తీసుకుని మరింత జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. రీసర్వేలో 22ఏ, పీజీఆర్‌ఎస్‌లో ఉన్నటు వంటి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. రెవెన్యూ సంబంధిత చట్టపరమైన విషయాల నిర్వహణను క్రమబద్ధీకరించడానికి, వాటిని పారదర్శకంగా చేయడానికి రూపొందించబడిన వెబ్ ఆధారిత వ్యవస్థ ఓఆర్‌సీఎంఎస్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్హత ఉన్న కౌలు రైతులకు సీసీఆర్‌కార్డులు అందజేయాలన్నారు. సీసీఆర్‌సీ కార్డులు మంజూరులో ఆలస్యమైతే వివిధ ప్రయోజనాలను, ముఖ్యంగా పంట రుణాలను పొందే అవకాశం కోల్పోతారన్నారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్‌కలెక్టర్ టి. శ్రీపూజ, డీఆర్‌ఓ ఉదయభాస్కరరావు, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ పాల్గొన్నారు.