
మద్యానికి బానిసై దోపిడీలు
● నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): వారంతా మద్యం, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలను తీర్చుకునేందుకు ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకెళుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. ఓ బ్యాంకు ఉద్యోగి ఈనెల 25వ తేదీన తన కుటుంబంతో కలిసి బైక్‌పై వెళుతుండగా రైల్వేస్టేషన్ వద్ద ముగ్గురు నిందితులు అడ్డగించారు. కత్తులతో చంపుతామని బెదిరించి నగదు దోచుకెళ్లారు. అదేరోజు రాత్రి ఇద్దరు బాలలు మద్యం తాగేందుకు తడికల బజారు సెంటర్ దళితవాడలో ఒంటరిగా ఇంటిముందు నిద్రిస్తున్న మహిళను కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు నవాబుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతికత ఆధారంగా బ్యాంకు ఉద్యోగిని బెదిరించి నగదు దోచుకెళ్లింది ఉడ్‌హౌస్ సంఘానికి చెందిన మునితేజ, సీహెచ్ మహేష్, బాలాజీనగర్‌కు చెందిన బి.దేవకుమార్‌లుగా గుర్తించారు. దళితవాడ దోపిడీ కేసులో ఇద్దరు బాలల్ని గుర్తించారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ఇద్దరు బాలలను తిరుపతిలోని జువైనెల్ హోంకు తరలించి మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై రెహమాన్, సిబ్బంది నరసయ్య, ప్రసాద్, మస్తాన్‌రావు, సుధాకర్, వేణు, మస్తానయ్య, గౌస్‌బాషాలను ఎస్పీ అభినందించారు.