
కండలేరులో 33.986 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 33.986 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,040, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
రైల్లో నుంచి పడి..
● వ్యక్తి మృతి
మనుబోలు: విజయవాడ నుంచి చైన్నె వెళ్తున్న రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మనుబోలు – కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య 147/7–5 కిలోమీటర్ వద్ద శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. పింక్ కలర్ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు.