
నేర నియంత్రణే లక్ష్యం
● ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు సిటీ: నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం ఎస్పీ నిర్వహించారు. దీనిని ఏపీ ఎస్‌పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధనను వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పురోగతి సాధించిందని అభినందించారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులు తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు కృషి చేయాలన్నారు. స్టేషన్ పరిధిల్లో మిస్సింగ్ కేసులు ఛేదనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ, రూరల్, కావలి, ఆత్మకూరు, కందుకూరు, మహిళా పీఎస్, ఏఆర్ డీస్పీలు, అన్ని సర్కిళ్ల ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.