
గిరిజన బాలికకు పరామర్శ
నెల్లూరు(అర్బన్): చిత్రహింసలకు గురై శరీరం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం కుడితిపాళేనికి చెందిన గిరిజన బాలిక చెంచమ్మను మంగళవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు పడిత్యా శంకర్‌నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలిచి రక్షణ కల్పించడంతోపాటు ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇస్లావత్ హనుమంతనాయక్, దుర్గానాయక్, ప్రసన్నకుమార్, యాటగిరి సునీల్, శివ పాల్గొన్నారు.