
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8
కుటుంబ కలహాలతో..
● వివాహిత బలవన్మరణం
ఆత్మకూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు హిల్‌రోడ్డులో మంగళవారం జరిగింది. ఎస్సైలు ఎస్‌కే జిలానీ, బి.సాయిప్రసాద్‌ల కథనం మేరకు.. గొట్ల హజరత్తయ్య, ప్రణవి (24) దంపతులకు ఇద్దరు సంతానం. మరో మహిళతో హజరత్తయ్య సన్నిహితంగా ఉంటూ భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణవి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సైలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.