
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి
నెల్లూరు(లీగల్): ప్రతిష్టాత్మకమైన నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.అయ్యపరెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం న్యాయవాదుల సంఘం ఎన్నికలు జరిగాయి. శనివారం రాత్రి 10 గంటల వరకు వచ్చిన సమాచారం మేరకు అధ్యక్షుడిగా వీసీఎస్‌ఆర్ ప్యానెల్‌కు చెందిన అయ్యపరెడ్డి తన సమీప ప్రత్యర్థి వి.ఉపేంద్రరావుపై 149 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా వీసీఎస్‌ఆర్ ప్యానెల్ నుంచి అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీలు గెలిచారు. న్యాయవాదుల ఐక్యవేదిక నుంచి ఉపాధ్యక్షుడు, టెజ్రరర్, జాతీయ న్యాయ వేదిక నుంచి లైబ్రరీ సెక్రటరీ గెలుపొందారు.
● ఉపాధ్యక్షుడిగా జల్లి పద్మాకర్ తన సమీప ప్రత్యర్థి ఈదూరు భాస్కరయ్యపై, జనరల్ సెక్రటరీగా నక్కల నాగరాజు తన సమీప ప్రత్యర్థి సత్తు అంకయ్యపై స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా కేఎల్ నారాయణ తన ప్రత్యర్థి ఎన్.రవికష్ణపై 93 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందరు. ట్రెజరర్‌గా డి.పెంచలప్రణీత్ తన సమీప ప్రత్యర్థి ఆర్.శివశంకరరావుపై 6 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జి.చంద్రశేఖర్ నాయుడు తన సమీప ప్రత్యర్థి ఎస్‌డీ వశీంపై 170 ఓట్ల మెజారిటీతో, లైబ్రరీ సెక్రటరీగా నాగశ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి ఎండీ ముజిబుర్ రహిమాన్‌ఫై 83 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లేడీ రెప్రజెంటేటివ్ లక్ష్మమ్మ, రమాదేవీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కార్యనిర్వాహక సీనియర్ (ఈసీ) విభాగంలో మూడు పోస్టులకు కార్యనిర్వాహక జూనియర్ (ఈసీ) విభాగంలో 5 పోస్టులకు కౌంటింగ్ కొనసాగుతోంది.

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి