
పట్టుకున్నారు.. వదిలేశారు
తడ: తమిళనాడు వైపు తరలిపోతున్న ఇసుక టిప్పర్‌ను శనివారం బీవీపాళెం చెక్‌పోస్టు వద్దనున్న పోలీసు ఔట్‌పోస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. కూటమి పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో పట్టుకున్న కొద్దిసేపటికే వదిలేశారు. సూళ్లూరుపేట నుంచి 12 టైర్ల టిప్పర్ సుమారు 50 టన్నుల ఇసుక తీసుకుని బీవీపాళెం మీదుగా తమిళనాడుకు బయలుదేరింది. తనిఖీ కేంద్రం వద్ద సిబ్బంది పరిశీలించి అదుపులోకి తీసుకున్నారు. మీడియా సిబ్బంది అక్కడ ఉండటాన్ని గమనించిన పోలీసులు టిప్పర్‌ని పక్కన పెట్టించారు. కొంత సమయం గడిచే సరికి టిప్పర్ అక్కడ కనిపించకుండా పోయింది. బడా నాయకుడు ఫోన్ చేయడంతో పోలీసులు వదిలేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 22 టన్నుల కెపాసిటీ కలిగిన ఈ టిప్పర్‌లో రెండింతలు ఇసుక నింపి పట్టలు కప్పి యథేచ్ఛగా తరలిస్తుండడం గమనార్హం. ఆంధ్రా నుంచి తమిళనాడుకు అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు బీవీపాళెం పాత చెక్‌పోస్టు వద్ద తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు.