
వెంగమాంబ బ్రహ్మోత్సవాల ఆదాయం రూ.51.50 లక్షలు
దుత్తలూరు: వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ మార్గాల ద్వారా రూ.51,50,638ల ఆదాయం వచ్చినట్లు ఈఓ వెట్టిగుంట ఉషశ్రీ తెలిపారు. శుక్రవారం దేవస్థాన సన్నిధిలో హుండీ కానుకల్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆమె వివరాలు తెలిపారు. హుండీల ద్వారా రూ.25,11,590, తాత్కాలిక అంగళ్ల వేలంపాట ద్వారా రూ.6.50 లక్షలు, అన్నదానం విరాళాల ద్వారా రూ.6,41,344, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.4,74,600, దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.7,03,660, తలనీలాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.49,920, అమ్మవారి కల్యాణ చదివింపుల ద్వారా రూ.22,764, ఉభయాల ద్వారా రూ.79,380, ఇతరాల ద్వారా రూ.17,380 చొప్పున వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది కంటే భక్తుల సంఖ్య తగ్గడంతో ఆదాయం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.నాగమల్లేశ్వరరాజు, సిబ్బంది పాల్గొన్నారు.