
కాకాణితో ఆదాల ములాఖత్
వెంకటాచలం: కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి శుక్రవారం ములాఖత్ అయ్యారు. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. అధైర్య పడొద్దని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ నేతలు స్వర్ణా వెంకయ్య, సీహెచ్ హరిబాబుయాదవ్, పాశం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు హంషీద్ అలీ, కొండేటి నరసింహారావు, షేక్ మొయిద్దీన్, ఆగాల శ్రీనివాసులురెడ్డి, ఖలీల్, జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
పాలిసెట్ కౌన్సెలింగ్
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్‌లోని ఆయా కోర్సుల్లో చేరేందుకు శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వి ద్యార్థులు ర్యాంకు కార్డు, ఫీజు చెల్లింపు రసీదు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు.
తల్లికి వందనం
వర్తింపజేయండి
ఆత్మకూరు: ప్రభుత్వం చిన్నారుల చదువుల కోసం అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని మున్సిపల్ కార్మికులకు ఇవ్వకపోవడం దారుణమని, వారికి సైతం ఆ పథకం వర్తింపజేయాల ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూ నియన్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక యూనియన్, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సి గంగాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చిరుద్యోగులైన కార్మికులకు తల్లికి వందనం ఇవ్వకపోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ పోస్టుల్లో 1998,
2008 డీఎస్సీ టీచర్లు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ల స్థానంలో 1998, 2008 డీఎస్సీలో ఎంపికై మినిమమ్ టైమ్ స్కేల్ కింద పని చేస్తున్న టీచర్లను నియమించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారి సీనియారిటీ ప్రకారం ఆయా పాఠశాలల్లో నియమించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల్లో ఖాళీ పోస్టులు లేకపోతే క్లస్టర్‌ల్లో నియమించనున్నారు. 1998, 2008 డీఎస్సీల్లో ఎంపికై ఉద్యోగాలు పొందలేక నిరీక్షిస్తున్న అభ్యర్థులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మినిమమ్ టైమ్ స్కేల్‌తో టీచర్ పోస్టులు కల్పించిన విషయం విదితమే.
లాసెట్‌లో రాష్ట్ర స్థాయిలో
124వ ర్యాంకు
దుత్తలూరు: ఏపీ లాసెట్ ఫలితాల్లో దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు చెందిన రావిళ్ల నాగార్జున రాష్ట్రస్థాయిలో 124వ ర్యాంకు సాధించాడు. తిరుపతి ఎస్‌వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హెచ్‌ఈసీ గ్రూపులో 941 మార్కులు సాధించాడు. లాసెట్ ప్రవేశ పరీక్ష రాయగా ఉత్తమ ప్రతిభ కనబరచడంతో గ్రామస్తులు అభినందించారు. నాగార్జున మాట్లాడుతూ భవిష్యత్‌లో సివిల్స్ సాధించి పేదలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమన్నారు.

కాకాణితో ఆదాల ములాఖత్

కాకాణితో ఆదాల ములాఖత్