
పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు
● రూ.13 కోట్ల విలువైన పనులకు
వర్క్ ఆర్డర్లు
● ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ విజయన్ హెచ్చరిక
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్లను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయకపోతే సంబంధిత విద్యుత్ అధికారుల జీతాల నుంచి రికవరీ చేస్తామని ఎస్‌ఈ విజయన్ హెచ్చరించారు. నగరంలోని విద్యుత్‌భవన్‌లో శుక్రవారం జిల్లాలోని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2022–23 ఏడాదికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్లపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా జిల్లాలో ఐదు డివిజన్లలో అధికంగా వర్క్ ఆర్డర్స్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆత్మకూరులో 398, కావలి 89, కోవూరు 134, నెల్లూరుటౌన్ 14, నెల్లూరురూరల్ 147 మొత్తం రూ.13 కోట్ల విలువైన 782 వర్క్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా వీటిని పరిష్కరించే విధంగా ఈఈలు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, నోడల్ అధికారి శేషాద్రిబాలచంద్ర, అకౌంట్స్ ఆఫీసర్ విజిత, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.