మామూళ్లతో విద్యాశాఖ ముఖం చాటేత | - | Sakshi
Sakshi News home page

మామూళ్లతో విద్యాశాఖ ముఖం చాటేత

Jun 21 2025 3:51 AM | Updated on Jun 21 2025 3:51 AM

మామూళ్లతో విద్యాశాఖ ముఖం చాటేత

మామూళ్లతో విద్యాశాఖ ముఖం చాటేత

కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూళ్లు, అనధికారికంగా పుస్తకాలు, యూనిఫాం విక్రయాలు చేస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలల గుర్తింపు, మౌలిక వసతులు, ఫీజుల వసూళ్లు, పుస్తకాలు, యూనిఫాం విక్రయాలపై ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డీఈఓలు పాఠశాలకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ అధికారులు ఎప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసిన సందర్భాలు ఉండడం లేదు. పాఠశాల గుర్తింపు సమయంలో కూడా గుమస్తా నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు ముడుపులు ఇవ్వడంతో ఆ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement