
బార్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
నెల్లూరు(లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. వీసీఎస్‌ఆర్ న్యాయవాదుల ప్యానెల్, న్యాయవాదుల ఐక్య వేదిక ప్యానెల్, జాతీయ న్యాయవాద ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు, మద్దతుదారులతో జిల్లా కోర్టు ఆవరణ కిక్కిరిసింది. ఘర్షణలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7:30 గంటలకు ముగిసింది. సెల్‌ఫోన్లను అనుమతించలేదు. పోలీసులు తనిఖీ చేసిన అనంతరం పోలింగ్ కేంద్రంలోకి న్యాయవాదులను పంపారు. 1,362 ఓట్లకు గానూ 1,149 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లెక్కింపు రాత్రి 10 నుంచి మొదలైందని ఎన్నికల అధికారి బి.శ్రీనివాసన్ తెలిపారు.

బార్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం