
హత్య కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఉత్తరప్రదేశ్ వాసి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్‌నగర్ జిల్లాకు చెందిన జైహింద్ సహానీ (40) ఉడ్ పాలిషింగ్ వర్కర్. అతను ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం నెల్లూరుకు వచ్చాడు. అదే రాష్ట్రం సిద్ధార్థ నగర్ జిల్లాకు చెందిన పరదేశి, రామ్‌కే
ష్‌తో కలిసి శ్రీనివాస నగర్ ఒకటో వీధిలో నివాసం ఉంటూ నగరానికి చెందిన శివ మేసీ్త్ర వద్ద పనిచేస్తున్నారు. జైహింద్ తమను మందలించడం, పెత్తనం చెలాయించడాన్ని పరదేశి, రామ్‌కేష్‌లు జీర్ణించుకోలేకపోయారు. ఈనెల 16వ తేదీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జైహింద్ భోజనం చేస్తుండగా వారు బండరాయితో అతని తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం నిందితులు పరారయ్యారు. మృతుడి బంధువు సోను సహాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వారిని బర్మాషెల్‌గుంట వద్ద గురువారం అరెస్ట్ చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.