
‘యోగాంధ్ర’ను విజయవంతం చేద్దాం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం జరిగే జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ కోరారు. శుక్రవారం స్టేడియంలో ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా, బాధ్యతతో నిర్వహించాలన్నారు. యోగా ఔత్సాహికులు ఉదయం 6 గంటలకు స్టేడియానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరవుతున్న దృష్ట్యా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమ అనంతరం విద్యార్థులు క్షేమంగా తిరిగి వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్డీఓ అనూష, డీఎస్‌డీఓ యతిరాజ్, డీఎంహెచ్‌ఓ సుజాత, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయన్, డీఈఓ బాలాజీరావు, ఆర్‌ఐఓ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జేసీ కార్తీక్
ఏసీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన