
టెర్రస్ పైనుంచి పడి..
కోవూరు: మండలంలోని లేగుంటపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక టెర్రస్ పైనుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయింది. స్థానికుల కథనం మేరకు.. రేష్మ కుమార్తె రషీఫా (5) సోమవారం తమ ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడింది. ఆ సమయంలో రేష్మ ఇంట్లో ఉంది. ఆమె బయటకు వచ్చి చూసింది. బాలికకు తీవ్రగాయాలు కావడంతో ఆ కుటుంబం వెంటనే మోటార్‌బైక్‌పై నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చైన్నెకి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రషీఫా చనిపోయింది. కాగా ఈ ఘటనపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెర్రస్ పైకి ఎవరైనా తీసుకెళ్లి తోసారా?, లేక ప్రమాదవశాత్తు జారిపడిందా? అనే కోణాల్లో విచారణ చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ బాలిక మృతి
అనుమానం వ్యక్తం చేసిన
బాధిత కుటుంబం