
రెడ్‌క్రాస్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు విరాళం
నెల్లూరు(అర్బన్): పొదలకూరు రోడ్డులోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కేన్సర్ ఆస్పత్రి రేడియోథెరపీ విభాగంలో లిఫ్ట్ కోసం రూ.లక్ష చొప్పున విరాళాన్ని ఇద్దరు దాతలు బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మొత్తాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ వాకాటి విజయకుమార్‌రెడ్డికి నగరానికి చెందిన దొడ్ల భరత్‌కుమార్‌రెడ్డి.. గంగా కన్యాకుమారి అందజేశారు. రెడ్‌క్రాస్ కోశాధికారి సురేష్‌జైన్, కేన్సర్ ఆస్పత్రి కో కన్వీనర్ కమలేష్‌జైన్, మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, రేడియోథెరపీ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ గీత ఉషశ్రీ, ఆస్పత్రి జీఎం భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.