కాసులు కురిపిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

కాసులు కురిపిస్తూ..

May 2 2025 12:06 AM | Updated on May 2 2025 12:06 AM

కాసుల

కాసులు కురిపిస్తూ..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పామాయిల్‌ మాఫియా బరితెగిస్తోంది. కొందరు లారీ డ్రైవర్ల వద్ద తక్కువ ధరకు ఆయిల్‌ కొనుగోలు చేస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తుండగా, మరికొందరు ఏకంగా ట్యాంకర్లనే మాయం చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో రహదారి వెంబడి పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌, బిస్కెట్‌ తదితర ఆయిల్‌ కంపెనీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటుగా ఇతర రాష్ట్రాలకు ఆయిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల పరిధిలో కృష్ణపట్నం పోర్టు రహదారి, జాతీయ రహదారి వెంబడి అనధికార ఆయిల్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయిల్‌ దందా కొనసాగిస్తున్నారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెం, వెంకటాచలం మండల పరిధిలోని నాయుడుపాళెం పెట్రోల్‌ బంక్‌, మనుబోలు మండల పరిధిలోని గురువిందపూడి రోడ్డు, కొండూరుసత్రం తదితర ప్రాంతాల్లో అనధికార కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ట్యాంకర్ల డ్రైవర్లతో పరిచయం చేసుకుని వారి ద్వారా పామాయిల్‌, బిస్కెట్‌ ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ తదితర రకాలను 50 లీటర్ల క్యాన్లకు పట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

హైవే వెంబడి అనధికార కొనుగోలు కేంద్రాలు

నిత్యం రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం

చోరీ కేసులో సూత్రధారిని తప్పించి పాత్రధారులను ఇరికించారు

మామూళ్ల మత్తులో

పట్టించుకోని పోలీసులు

కృష్ణపట్నం పోర్టు రహదారి వెంబడి సాగే ఆయిల్‌ అక్రమ దందా నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మూడు మండలాల పరిధిలో నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ టీడీపీ నాయకుడు నాయుడుపాళెం పెట్రోల్‌ బంక్‌ వద్ద నిత్యం వందల లీటర్ల పామాయిల్‌ తక్కువ ధరకు కొనుగోలు చేయించి సొమ్ము చేసుకుంటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తంతుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వాహకులు పోలీసులకు నెలనెలా మాముళ్లు ఇస్తున్నట్లు సమాచారం. ట్యాంకర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయిల్‌ను హోటళ్లు, బిస్కెట్ల తయారీ కేంద్రాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పామాయిల్‌ వ్యాపారం కాసులు కురిపిస్తుండటంతో కొందరు ఏకంగా రూ.43 లక్షల విలువ చేసే పామాయిల్‌ను స్వాహా చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసుల విచారణలో దొరికిపోయారు. అయితే ఈ కేసులో రాజకీయ జోక్యం కారణంగా సూత్రధారులను తప్పించారనే ఆరోపణలున్నాయి. వెంకటాచలంలో టీడీపీ కీలక నాయకుడు కావడంతో ఆయన్ను తప్పించారని తెలిపింది. అధికార పార్టీ పరువు పోతుందని స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సూత్రధారుడి పేరు తొలగించి పాత్రధారులను ఇరికించారని తెలుస్తోంది.

కాసులు కురిపిస్తూ..
1
1/2

కాసులు కురిపిస్తూ..

కాసులు కురిపిస్తూ..
2
2/2

కాసులు కురిపిస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement