వాళ్లిద్దరికి ఎందుకు చోటివ్వలేదు.. టీమిండియా ప్రధాన సమస్య అదే! | Worrying Point Is: India WC Winning Great Raises Concern Over Asia Cup Squad | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: వాళ్లిద్దరికి ఎందుకు చోటివ్వలేదు.. టీమిండియా ప్రధాన సమస్య అదే: మాజీ క్రికెటర్‌

Aug 22 2023 2:23 PM | Updated on Aug 22 2023 3:16 PM

Worrying Point Is: India WC Winning Great Raises Concern Over Asia Cup Squad - Sakshi

Asia Cup 2023 India Squad: ఆసియా కప్‌-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ మదన్‌ లాల్‌ పెదవి విరిచాడు. ఇలాంటి మెగా ఈవెంట్లలో ఆడేందుకు వంద కంటే ఎక్కువ శాతం ఫిట్‌నెస్‌ కలిగి ఉన్న ప్లేయర్లనే ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు.

కీలక టోర్నీలు ఆడేటపుడు రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా పాకిస్తాన్‌, శ్రీలంక వేదికలుగా ఆసియా వన్డే కప్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఈ ఈవెంట్‌కు సంబంధించి బీసీసీఐ సోమవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా.. గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి రానున్నట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. అయితే, గాయం వెంటాడుతున్న కారణంగా రాహుల్‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్‌ మాత్రం పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించాడు.

ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే
ఈ నేపథ్యంలో మదన్‌ లాల్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘అందరూ ఊహించినట్లుగానే.. ఒకటీ రెండు మార్పులతో జట్టు ప్రకటన వచ్చింది. అయితే, ఆటగాళ్లు ఎంత వరకు ఫిట్‌గా ఉన్నారన్న విషయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది.

గాయం నుంచి కోలుకున్న తర్వాత కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌ లాంటివి రెగ్యులర్‌ మ్యాచ్‌లకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇలాంటి మెగా ఈవెంట్లలో ఆడేటపుడు 100 శాతం ఫిట్‌గా ఉంటే సరిపోదు. 

అంతకంటే ఎక్కువే కావాలి. ప్రస్తుతం టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ఇదే అనడంలో సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌, వెటరన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు జట్టులో చోటు ఇవ్వకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ స్టార్‌ మదన్‌ లాల్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఆసియా వన్డే కప్‌-2023కి టీమిండియా:
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.
స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌

చదవండి: అయ్యో రింకూ.. ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్‌! బుమ్రా మంచి మనసు
అందుకే తిలక్‌ను సెలక్ట్‌ చేశాం.. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌
వరల్డ్‌ప్‌ జట్టులో రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్‌ కూడా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement