అర్జున్‌ టెండుల్కర్‌ను ఎందుకు ఆడించట్లేదు? | Why didnt you get Arjun Tendulkar: Ex Ind Star Questions Pant Tactical Moves | Sakshi
Sakshi News home page

అర్జున్‌ టెండుల్కర్‌ను ఎందుకు ఆడించట్లేదు?

May 5 2026 12:14 PM | Updated on May 5 2026 12:25 PM

Why didnt you get Arjun Tendulkar: Ex Ind Star Questions Pant Tactical Moves

గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌. గతేడాది మెగా వేలంలో అతడి కోసం పోటీ పడి మరీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా లీగ్‌ చరిత్రలోనే అతడు అ‍త్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు.

బ్యాటర్‌గా, సారథిగా విఫలం
ఈ క్రమంలో పంత్‌కు లక్నో కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించిన యాజమాన్యం.. మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni), రోహిత్‌ శర్మ (Rohit Sharma) మాదిరి ఐపీఎల్‌లో దిగ్గజ సారథి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, పంత్‌ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలోనూ విఫలమవుతున్నాడు.

గతేడాది 13 ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ కేవలం 269 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ ఏడాది లక్నో పరిస్థితి ఇంకా దిగజారింది. ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది లక్నో. ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడి ఏడో పరాజయాన్ని నమోదు చేసింది.

వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
ఈ నేపథ్యంలో పంత్‌ కెప్టెన్సీపై విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ... ‘‘పంత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో ప్రిన్స్‌ యాదవ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు.

అర్జున్‌ టెండుల్కర్‌ను ఎందుకు ఆడించట్లేదు?
ఎందుకంటే అతడు యార్కర్లు సంధించడంలో సఫలమయ్యాడు. అతడు ఒక్కడే రాణించగలిగాడు. కెప్టెన్‌గా పంత్‌ మిగతా బౌలర్లనూ అదే ఫార్ములా పాటించమని చెప్పాలి. నిజానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో చూశాను.. అందులో అర్జున్‌ టెండుల్కర్‌ నెట్స్‌లో మంచిగా యార్కర్లు వేస్తున్నాడు.

కాబట్టి పంత్‌ అతడిని తుదిజట్టులో ఆడిస్తే బాగుండేది’’ అని మనోజ్‌ తివారి అభిప్రాయపడ్డాడు. ఇక గతంలో లక్నో యజమాని సంజీవ్‌ గోయెంకా.. పంత్‌ ధోని, రోహిత్‌ అంతటి వాడు కావాలని ఆశించిన విషయం ప్రస్తావనకు రాగా.. ‘‘ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ కెప్టెన్లుగా చాలా భిన్నమైనవారు. వారితో పోలిక సరికాదు’’ అని మనోజ్‌ తివారీ పేర్కొన్నాడు.

కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌ నుంచి అర్జున్‌ టెండుల్కర్‌ను లక్నో ట్రేడ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితం చేసింది లక్నో నాయకత్వ బృందం. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 

చదవండి: జై శ్రీరామ్‌.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ

Advertisement
 
Advertisement
Advertisement