
సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకుతెస్తూ ఆడిన షాట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆండ్రూ టై బౌలింగ్‌లో వికెట్ నుంచి పక్కకు జరిగి అచ్చం ఏబీ తరహాలో ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టాడు. కోహ్లి షాట్ చూసి టీమిండియా సహచరులతో పాటు ఆసీస్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కోహ్లి తన శైలికి భిన్నంగా ఆడిన షాట్‌లో అతని నైపుణ్యత మరింత పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ.(చదవండి : వీరు విధ్వంసానికి తొమ్మిదేళ్లు)
అయితే కోహ్లి తాను ఆడిన షాట్‌పై మ్యాచ్ అనంతరం స్పందించాడు. నేను ఆ షాట్ కొట్టిన సమయంలో హార్దిక్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. బహుశా ఆ షాట్ ఆడుతానని పాండ్యా కూడా ఊహించి ఉండడు. ఈ షాట్ విషయంపై ఏబీకి మెసేజ్ చేస్తాను. అచ్చం అతనిలా ఆడానా లేదా అనేది చెప్తాడేమో చూడాలి. అంతేగాక ఏబీ ఏ విధంగా రిప్లై ఇస్తాడో చూడాలనుందని ' నవ్వుతూ పేర్కొన్నాడు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు')
Virat Kohli or AB de Villiers? 🤯
Ridiculous shot from the Indian skipper! #AUSvIND pic.twitter.com/6g8xY8ihIj
— cricket.com.au (@cricketcomau) December 6, 2020
కాగా రెండో టీ 20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోహ్లి 24 బంతుల్లో 40తో నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడగా... చివర్లో హార్దిక్ 22 బంతుల్లో 44 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో టీ20 సిరీస్ భారత్ వశమైంది. నామమాత్రంగా మారిన మూడో టీ20ని ఎలాగైనా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.