
వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో భారత అదరగొట్టింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.
కోహ్లి ఏం చేశాడంటే?
విరాట్ కోహ్లి ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లిని ఆరాధించే అభిమానులకు కొదవలేదు. విరాట్ విరాభిమానులలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒకడు. విరాట్‌ను అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడి బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరిస్తాని చాలా సందర్భాల్లో బాబర్ చెప్పుకొచ్చాడు.
అయితే తాజాగా భారత్‌తో మ్యాచ్ అనంతరం కోహ్లిని తన సంతకం చేసిన జెర్సీ ఇవ్వమని బాబర్ ఆడిగాడు. కోహ్లి వెంటనే తన సంతకం చేసిన జెర్సీని బాబర్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కోహ్లి తన సంతకం చేసిన జెర్సీ పాక్ క్రికెటర్లకు ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆసియాకప్-2022 సందర్భంగా పాక్ స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్‌కు తన జెర్సీని గిఫ్ట్‌గా విరాట్ ఇచ్చాడు.
చదవండి: ODI WC 2023: ‘భారీ విజయాలపై ఇంగ్లండ్ దృష్టి పెట్టాలి.. లేదంటే కష్టమే'
FANBOY MOMENT FOR BABAR AZAM....!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
Babar asks for a signed from Virat Kohli and Virat gives it.pic.twitter.com/Caq3GoQoaV