#WrestlersProtest: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం; ఈడ్చిపడేశారు

Vinesh Phogat-Sakshi Malik-Detained By Delhi Police-New Parliament

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు.

ఇవాళే కొత్తగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ ''మహిళా మహాపంచాయత్‌'' నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్‌ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్‌మంతర్‌ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, మరో రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఉన్నారు. 

కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. మేం బారీకేడ్లు విరగొట్టామా..? ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

చదవండి: స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్‌ బలం.. జాగ్రత్త

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top