రాస్‌ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు

Two People Evicted From Stadium Racist Abuse At Ross Taylor In England - Sakshi

సౌథాంప్టన్‌: ఇంగ్లండ్‌లో సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాడ్‌ మధ్య  జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 5వ రోజున న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌కి చేదు అనుభవం ఎదురైంది. రాస్‌ టేలర్‌పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్‌ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు.

ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్‌ (8) రోహిత్‌ (30; 2 ఫోర్లు) అవుట్‌ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్‌ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్‌ 3 వికెట్లు తీశారు

చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top