
రావల్పిండి: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో పాకిస్తాన్ ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ లో పోటీపడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో బాబర్ ఆజమ్ సారంథ్యంలోని పాకిస్తాన్ జట్టు తలపడు తుంది. తొలి మూడు మ్యాచ్‌లు రావల్పిండిలో, చివరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగుతాయి. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌లను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో తిలకించవచ్చు.