భారత్‌- పాక్‌లు ఫైనల్లో తలపడితే చూడాలనుంది: పాక్‌ హెడ్‌కోచ్‌

T20 World Cup2021: Saqlain Mushtaq says India vs Pakistan T20 WC final will be Great - Sakshi

T20 World Cup 2021: Saqlain Mushtaq Said He Wants Final Between India vs Pakistan: టీ20 ప్రపంచ కప్‌2021లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఫైనల్‌ జరగాలని కోరుకుంటున్నట్లు పాక్‌ ప్రధాన కోచ్‌ సక్లెయిన్ ముస్తాక్ తెలిపాడు. రేపు( ఆక్టోబర్‌29) జరగబోయే పాక్‌- ఆఫ్గాన్‌ల మ్యాచ్‌ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లడిన ముస్తాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

"భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఇకపై జరగవు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి ,మెంటార్ ధోనీ పాకిస్తాన్ ఆటగాళ్లతో సంభాషించడం మనకు కనిపించింది. రెండు జట్లు కలిసి మరిన్ని మ్యాచ్‌లు ఆడితే సత్సంబంధాలు మెరుగుపడి, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి సహాయపడతాయని" ముస్తాక్ అభిప్రాయపడ్డాడు.

‘‘ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరుకుంటే అది గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మరోసారి తలపడాలని నేనూ కోరుకుంటున్నాను. ఇదివరకే ఒకసారి మేము వాళ్లను ఓడించామని కాదు, వారు  చాలా బలమైన జట్టుగా ఉన్నారు. అంతేగాక ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ ఫేవరేట్ అని అంతా భావిస్తున్నారు’ అని అన్నాడు 

"గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, ధోనితో మా ఆటగాళ్లు ప్రవర్తించిన విధానాన్ని మనమంతా చూశాం. మనమందరం మనుషులం. ఒకరినొకరు ప్రేమిస్తాము. ఇది కేవలం ఆట మాత్రమే అనే  సందేశాన్ని యావత్‌ ప్రపంచానికి తెలియజేశారు. ఇటువంటి సందేశాన్ని పంపినందుకు ఆటగాళ్లకు హ్యాట్సాఫ్. స్నేహం గెలవాలి, శత్రుత్వం ఓడిపోవాలి" అని ముస్తాక్ పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ టైటిల్‌ ఫేవరేట్ గా ఉందని అతడు తెలిపాడు. టోర్నీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లను కూడా తాము బలమైన జట్లుగానే భావిస్తున్నామని ముస్తాక్ అన్నాడు. 

చదవండిIND Vs NZ: కివీస్‌తో మ్యాచ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌.. టాస్‌ గెలువు కోహ్లి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top