చారిత్రక సిరీస్‌ను ప్రకటించిన శ్రీలంక | Sri Lanka Cricket Announces Historic West Indies Tour After Five Years Of Wait, Check Out Complete Schedule Inside | Sakshi
Sakshi News home page

చారిత్రక సిరీస్‌ను ప్రకటించిన శ్రీలంక

May 3 2026 5:31 PM | Updated on May 3 2026 5:50 PM

Sri Lanka Announces Historic Tour After Five Years Of Wait

శ్రీలంక క్రికెట్‌ బోర్డు చారిత్రక సిరీస్‌ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్‌ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంక జట్టు చివరిసారిగా 2021లో వెస్టిండీస్‌లో పర్యటించింది. 

ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కరీబియన్‌కు వెళ్లనుంది.

ఈ సిరీస్‌ పూర్తి షెడ్యూల్

వన్డేలు – సబీనా పార్క్, కింగ్‌స్టన్
జూన్ 3 – తొలి వన్డే
జూన్ 6 – రెండో వన్డే
జూన్ 8 – మూడో వన్డే

టీ20లు – సబీనా పార్క్
జూన్ 11 – తొలి టీ20
జూన్ 13 – రెండో టీ20
జూన్ 14 – మూడో టీ20

టెస్టులు – సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియం, ఆంటిగ్వా
జూన్ 25 నుంచి తొలి టెస్టు
జూలై 3 నుంచి రెండో టెస్టు

ఇరు జట్లకు కీలకం
ఇటీవలికాలంలో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సిరీస్ వారిరువురి పునరుద్ధరణకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2021 పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డేల్లో వెస్టిండీస్ శ్రీలంకను వైట్‌వాష్ చేసింది.

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 డిజాస్టర్‌ తర్వాత శ్రీలంక క్రికెట్‌ బోర్డులో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. మెగా టోర్నీలో లంక జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ఇటీవలే రాజీనామా చేశాడు. దీంతో ఇటీవలే కుమార సంగక్కర, రోషన్‌ మహానామా లాంటి మాజీలతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లంక క్రికెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement