
Courtesy: IPL Twitter
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ చివరి 16 మ్యాచ్‌లలో 13 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. అఖరి 16 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు ఓడిన తొలి ఐపీఎల్ జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (68), దీపక్ హుడా (54) పరుగులతో రాణించారు. ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 44 పరుగులతో టాప్ స్కోరర్ నిలవగా.. పూరన్ (34), వాషింగ్టన్ సుందర్ (18) పరుగులు సాదించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4, జాసన్ హోల్డర్ 3, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.
చదవండి: IPL 2022: 'ఎస్‌ఆర్‌హెచ్‌కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు'