‘ప్రపంచకప్‌కు మేం సిద్ధం’ | Smriti Mandhana on T20 World Cup | Sakshi
Sakshi News home page

‘ప్రపంచకప్‌కు మేం సిద్ధం’

May 20 2026 3:56 AM | Updated on May 20 2026 3:56 AM

Smriti Mandhana on T20 World Cup

స్మృతి మంధాన వ్యాఖ్య

ముంబై: టి20 ప్రపంచ కప్‌ కోసం నిర్వహించిన సన్నాహక శిబిరం చాలా బాగా సాగిందని, టోర్నీ కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని భారత మహిళల క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన వెల్లడించింది. ఉదాసీనతకు తావు లేకుండా శ్రమించి టైటిల్‌ సాధించడమే తమ లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించింది. జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా మహిళల టి20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. దీనికి సంబంధించి బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో జట్టుకు ప్రత్యేక కోచింగ్‌ క్యాంప్‌ను నిర్వహించారు. 

‘మా సన్నాహక శిబిరం అన్ని రకాలుగా చాలా బాగా సాగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను. ఎందుకంటే మేం వరల్డ్‌ కప్‌కు వెళుతున్నామనే విషయం మరచిపోవద్దు. అమ్మాయిలు పూర్తి స్థాయిలో ఫిట్‌గా, ఉత్సాహంగా ఉన్నారు. వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. శిబిరంలో అందరూ చాలా కష్టపడ్డారు’ అని స్మృతి చెప్పింది. 

ఈ నెల 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న మహిళల బృందం వరల్డ్‌ కప్‌కు ముందు ఇంగ్లండ్‌తోనే మూడు టి20 మ్యాచ్‌ సిరీస్‌ ఆడుతుంది. ‘మేం వరల్డ్‌ కప్‌ కోసమే సిద్ధమైనా దానికి ముందు సిరీస్‌ కూడా చాలా కీలకం. మా కఠోర శ్రమ ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నాం. ట్రోఫీని గెలిచి భారత్‌ గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాం’ అని స్మతి పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement