పెళ్లిపై నిశ్శబ్దం వీడిన శుభ్‌మన్‌ గిల్‌ | Shubman Gill Breaks Silence On His Marriage Intentions | Sakshi
Sakshi News home page

పెళ్లిపై నిశ్శబ్దం వీడిన శుభ్‌మన్‌ గిల్‌

May 3 2026 8:51 PM | Updated on May 3 2026 8:51 PM

Shubman Gill Breaks Silence On His Marriage Intentions

టీమిండియా టెస్ట్‌, వన్డే.. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ అయిన శుభ్‌మన్‌ గిల్‌ తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ ఇవాళ (మే 3) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో గిల్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చాడు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావా..? అని ప్రెజెంటర్ డ్యానీ మోరిసన్ అడగగా, అలాంటిదేమీ లేదని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.

గిల్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని కొందరు.. బాలీవుడ్‌ నటీమణులు సారా అలీ ఖాన్‌, అవ్‌నీత్‌ కౌర్‌, సోనమ్‌ బజ్వా ప్రేమాయణం​ సాగిస్తున్నాడని మరికొందరు పుకార్లు పుట్టించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గిల్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంది.

తన పెళ్లి, డేటింగ్‌పై వచ్చిన వార్తలను గిల్‌ గతంలోనూ చాలాసార్లు ఖండించాడు. తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అయినా గిల్‌ ఏదో దాస్తున్నాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, గిల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ గత సీజన్‌లలో మాదిరిగానే రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 3 అర్ద సెంచరీల సాయంతో 373 పరుగులు చేసి, లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ సీజన్‌లో గిల్‌ నేతృత్వంలోని గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

ఇవాళ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ ఆదిలోనే ప్రత్యర్దిని చావు దెబ్బకొట్టినప్పటికీ.. సూర్యాంశ్‌ షేడ్గే (58), మార్కస్‌ స్టోయినిస్‌ (29) కలిసి పంజాబ్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. 15.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 126-5గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement