
న్యూఢిల్లీ: నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దుబాయ్‌లో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అచ్చం ఇలాంటి సంఘటనే గతంలో టిమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఎదురైంది. దీనిపై సచిన్ స్పందిస్తూ గురువారం ట్విటర్‌లో రెండు వీడియోలను పంచుకున్నారు. ‘నిన్నటి మ్యాచ్‌లో సంజు పట్టిన క్యాచ్ అద్బుతం. అయితే ఆ క్యాచ్ పట్టె సమయంలో అలా వెనక్కి పడటం వల్ల తలకు అయిన గాయం నొప్పిని తట్టుకోలేము. ఎందుకంటే అచ్చం అలాంటే సంఘటనే నేను కూడా గతంతో ఎదుర్కొన్నాను. 1992 ప్రపంచ కప్‌లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను కూడా అలానే గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టి వెనక్కి పడ్డాను. దీంతో నా తలకు స్వల్ప గాయమైంది’ అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. (చదవండి: కోల్‌కతా పేస్‌కు రాయల్స్ కుదేల్)
అయితే నిన్నటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ సమయంలో 17వ ఓవర్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ టామ్ కరన్ వేసిన చివరి బంతిని ప్యాట్ కమిన్స్ డీప్ బ్యాక్‌వర్డ్ స్కేర్‌లోకి గట్టిగా బాదాడు. ఈ బంతిని బౌండరీ దాటకుండా సంజు శాంసన్ గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. ఈ క్రమంలో శాంసన్ అలానే వెనక్కి పడడంతో అతడి తలకు స్వల్ప గాయమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Thanks for sharing this! 🙂 https://t.co/2r4e7cEdCm
— Sachin Tendulkar (@sachin_rt) September 30, 2020