ముంబై ఇండియన్స్‌పై రూతురాజ్‌ గైక్వాడ్‌ కొత్త చరిత్ర | Ruturaj Gaikwad Create Record Highest Individual Score Against Mumbai | Sakshi
Sakshi News home page

IPL 2021 Phase 2: ముంబై ఇండియన్స్‌పై రూతురాజ్‌ గైక్వాడ్‌ కొత్త చరిత్ర

Sep 19 2021 10:20 PM | Updated on Sep 19 2021 10:31 PM

Ruturaj Gaikwad Create Record Highest Individual Score Against Mumbai - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్‌ రూతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధసెంచరీతో చెలరేగాడు. కేవలం 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్స్‌లతో 88 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఈ సందర్భంగా ముంబైపై రుతురాజ్‌ ఒక కొత్త రికార్డును నమోదు చేశాడు.ముంబై పై అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా గైక్వాడ్‌ రికార్డు సాధించాడు. అంతకు ముందు మైఖల్‌ హాస్సీ 86 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గైక్వాడ్‌ అతన్ని అధిగమించాడు.

ఒక దశలో ఆదిలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రూతురాజ్‌, జడేజా  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో 26 పరగులు చేసిన జడేజా బూమ్రా బౌలింగ్‌లో వెనుదిరగనప్పటికీ రూతురాజ్‌ తన జోరును కొనసాగించాడు. చివర్లో బ్రావో మెరుపులు మెరిపించడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

చదవండి: IPL 2021 Phase 2:  ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్న భారత ఆటగాళ్లు వీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement