రన్నరప్‌ రష్మిక  | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ రష్మిక 

Published Mon, Mar 18 2024 1:25 AM

Runner up is Rashmika - Sakshi

ఇండోర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) సర్క్యూట్‌లో రెండో సింగిల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన హైదరాబాద్‌ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన డబ్ల్యూ35 ఐటీఎఫ్‌ టోర్నీలో 22 ఏళ్ల రన్నరప్‌గా నిలిచింది.

రెండో సీడ్‌ దలీలా జకుపోవిచ్‌ (స్లొవేనియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రష్మిక 3–6, 2–6తో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో రష్మికకు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్‌ చేసేందుకు తొమ్మిదిసార్లు అవకాశం వచ్చినా ఆమె ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది.

మరోవైపు రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఫైనల్‌ చేరే క్రమంలో రష్మిక టాప్‌ సీడ్, ఐదో సీడ్, ఏడో సీడ్‌ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ టోర్నీ ప్రదర్శనతో రష్మిక నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ 428వ ర్యాంక్‌కు చేరుకుంటుంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement