బీసీసీఐ ఆదేశాలు: ఆ టోర్నీలో ఆడనున్న రోహిత్‌, కోహ్లి! | Rohit Sharma, Virat Kohli likely to feature in Duleep Trophy | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఆదేశాలు: ఆ టోర్నీలో ఆడనున్న రోహిత్‌, కోహ్లి!

Aug 12 2024 11:42 AM | Updated on Aug 12 2024 12:17 PM

Rohit Sharma, Virat Kohli likely to feature in Duleep Trophy

శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ ఓట‌మి త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టుకు దాదాపు 40 రోజుల‌ సుదీర్ఘ విరామం ల‌భించింది. అనంత‌రం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లిలు దేశీవాళీ క్రికెట్ ఆడనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లను దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. దులీప్ ట్రోఫీ సెప్టెంబ‌ర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్‌లో వీరిద్ద‌రూ ఆడే అవ‌కాశ‌ముంది. 

కాగా ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిందేనని బీసీసీఐ సెలక్షన్ కమిటీ  స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రోహిత్‌, కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం దులీప్ ట్రోఫీ ఆడనున్నట్లు సమాచారం. 

బంగ్లాతో సిరీస్‌కు ముందు ఈ టోర్నీని ప్రాక్టీస్ ఉపయోగించు​కోవాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది. కాగా బంగ్లాతో టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Olympics: వినేశ్‌ విషయంలో మా తప్పేమీ లేదు: పీటీ ఉష
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement