Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్‌ పెట్టండి'

Rohit Sharma Reacts Cricket Australia Accusation Doctored Pitch Nagpur - Sakshi

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో కఠినమైన సవాల్‌ను ఎదుర్కోనున్నాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. వన్డే, టి20ల్లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న టీమిండియా టెస్టుల్లో కూడా నెంబర్‌వన్‌ కావాలంటే సిరీస్‌ విజయం తప్పనిసరి. ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడేది లేనిది కూడా సిరీస్‌ విజయంతోనే ముడిపడి ఉంది. ఒక రకంగా రోహిత్‌కు ఇది సవాల్‌ అని చెప్పొచ్చు. అంతేకాదు ఒకవేళ ఆసీస్‌తో సిరీస్‌ను ఓడిపోతే రోహిత్‌ కెప్టెన్సీతో పాటు టెస్టు కెరీర్‌కు ముగింపు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోహిత్‌ ఎంత జాగ్రత్తగా ఆడితే అంత మంచిది.

ఇదిలా ఉంటే తొలిటెస్టు జరగనున్న నాగ్‌పూర్‌ పిచ్‌ను ఆస్ట్రేలియా క్రికెట్‌ 'డాక్టర్డ్‌ పిచ్‌(Doctored Pitch)' అని పేర్కొనడం ఆసక్తి రేపింది. అంతేకాదు జట్టు వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. స్మిత్‌ వ్యవహారంపై క్రికెట్‌ అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు.

అయితే మ్యాచ్‌కు రెండురోజుల ముందు క్యురేటర్‌ రోలింగ్‌కు ముందు.. పిచ్‌ సెంటర్‌లో వాటర్‌ కొట్టడంతో సమస్య మొదలైంది. ఆ తర్వాత లెఫ్ట్‌ హ్యాండర్స్‌ బ్యాటింగ్‌ చేసే లెగ్‌స్టంప్‌వైపు మరోసారి నీళ్లు కొట్టి రోలింగ్‌ చేశారు. దీనిని ఆస్ట్రేలియా క్రికెట్‌ తప్పుబట్టింది. భారత్‌ తమకు అనుకూలంగా పిచ్‌ తయారు చేసుకోవడం మంచిదే.. కానీ ఇలా పదే పదే పిచ్‌ను నీళ్లతో తడపడం మాకు నచ్చలేదని.. ఇదొక 'డాక్టర్డ్‌ పిచ్‌(Doctored Pitch)'లాగా తయారైందంటూ కామెంట్‌ చేశారు. ఇక​ స్మిత్‌ కూడా పిచ్‌పై లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్స్‌కు బ్యాటింగ్‌ చేయడం కాస్త కఠినంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌ సహా స్టీవ్‌ స్మిత్‌ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఘాటుగా స్పందించాడు. 'డాక్టర్డ్‌ పిచ్‌(Doctored Pitch)' అని పేర్కొన్న ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ''నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా క్రికెట్‌ చేస్తున్న ఆరోపణలు వింతగా అనిపిస్తున్నాయి. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించడం కోసమే వాటర్‌ కొట్టి పిచ్‌ను ఎక్కువసార్లు రోలింగ్‌ చేశారు. అనవసరంగా దీనిని పెద్ద విషయం చేస్తున్నారు. పిచ్‌పై మాట్లాడడం మానేసి ఆటపై ఫోకస్‌ చేయడం మంచిది.'' అని పేర్కొన్నాడు.

''టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్‌పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్‌కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్‌కి ఉన్న క్రేజ్.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి నాలుగు సాలిడ్ మ్యాచులు ఉన్నాయి. ఈ సిరీస్ మాకు ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలుసు. అయితే గెలవడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు పక్కాగా తెలుసు. ఏ మ్యాచ్‌కి అయిన సన్నద్ధత చాలా ముఖ్యం. రేపు ఆడబోయే 22 మంది క్రికెటర్లు కూడా క్వాలిటీ క్రికెట్ ఆడతారు.ఎవరైతే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకే విజయం వరిస్తుంది.

రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో లేకపోవడం తీరని లోటే. అయితే అతని రోల్‌ని భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏం చేయగలడో అందరికీ తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది ఇంకా డిసైడ్ చేయలేదు. మ్యాచ్‌ సమయానికి ఈ విషయంలో క్లారిటీ రానుంది.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!'

ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top