Rishabh Pant: 'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్‌ సాధించాడు'

Rishab Pant 1st Place Highest ODI Score Indian Wicketkeepers South Africa - Sakshi

సౌతాఫ్రికా గడ్డపై రిషబ్‌ పంత్‌ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో 85 పరుగులతో ఆకట్టుకున్న పంత్‌.. ఆ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. పంత్‌ తర్వాతి స్థానంలో రాహుల్‌ ద్రవిడ్‌(77 పరుగులు, 2001) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఎంఎస్‌ ధోని(65 పరుగులు, 2013), రాహుల్‌ ద్రవిడ్‌( 62, వర్సెస్‌ ఇంగ్లండ్‌, 2003 వన్డే ప్రపంచకప్‌), ఎంఎస్‌ ధోని(55 పరుగులు,2006), సబా కరీమ్‌(55 పరుగులు, 1997) ఉన్నారు. దీంతో ధోని, ద్రవిడ్‌లకు సాధ్యం కానిది పంత్‌ సాధించాడంటూ అభిమానులు పేర్కొన్నారు.

చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్‌

ఇక గత వన్డే మ్యాచ్‌ ద్వారా బ్యాటింగ్‌లో నాలుగో స్థానానికి ప్రమోషన్‌ పొందిన పంత్‌ ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మాత్రం పంత్‌ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పంత్‌ సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడూ కేఎల్‌ రాహుల్‌ కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా నడిచింది. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో 85 పరుగుల వద్ద పంత్‌ షంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. 

చదవండి: అరె! పంత్‌.. కొంచమైతే కొంపమునిగేది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top