Prithvi Shaw's Heart Breaks Again, Breakup With Second Girlfriend Too - Sakshi
Sakshi News home page

Prithvi Shaw: పృథ్వీ షా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్‌ పడిందా!

Jan 31 2023 9:32 AM | Updated on Jan 31 2023 10:23 AM

Report: Prithvi Shaw Heart Breaks Again Breakup Second Girlfriend Too - Sakshi

టీమిండియా  యువ క్రికెటర్ పృథ్వీషా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్‌ పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పృథ్వీ షా నిధి తపాడియా అనే అమ్మాయితో లవ్‌లో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న ఈ ఇద్దరు తమ రిలేషన్‌షిప్‌ను బ్రేక్‌ చేసుకున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఇటీవలే నిధి తపాడియా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక ఫోటోను పంచుకుంది.

పంజాబీ నేపథ్యంలో ఉన్న బ్రేకప్‌ పాటను షేర్‌ చేసుకుంది. ఆ తర్వాత పృథ్వీ షా, నిధి తపాడియాలు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం బ్రేకప్‌ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇక నిధి తపాడియా మోడల్, నటిగా రాణిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 108కె ఫాలోవర్లు ఉన్నారు. నిధి తపాడియా స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్.

కాగా ఇటీవలే ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్‌గా జరుపుకొన్నారు. పృథ్వీ షా రంజీల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది. ఈ ఇద్దరు ఇలా తమ లవ్‌ను బ్రేక్‌ చేసుకోవడంపై ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ సింగ్‌ తో కూడా సన్నిహితంగా మెలిగాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు పార్టీలకు, పబ్‌లకు వెళ్లారు. పృథ్వీ షా ప్రేమలో ఉన్నాడని తెలిసేలోపే ఇద్దరి మధ్య రిలేషిన్‌షిప్‌కు బ్రేక్‌ పడింది. 

ఇక పృథ్వీ షా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆడుతున్నాడు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చినప్పటికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు.మూడో టి20కి వరుసగా విఫలం అవుతున్న ఇషాన్‌ కిషన్‌ స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సహా అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి: బట్లర్‌కు ఇదేమి కొత్త కాదు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement