WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్‌! ఎవరీ శ్రేయాంక? | RCB Vs DC Highlights: RCBs Shreyanka Patil Claiming Four Wicket Haul Against Delhi Capitals In WPL Final - Sakshi
Sakshi News home page

WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్‌! ఎవరీ శ్రేయాంక?

Mar 18 2024 12:03 PM | Updated on Mar 18 2024 1:06 PM

RCBs Shreyanka Patil  claiming four wicket haul against Delhi Capitals in WPL final - Sakshi

రాయల్‌ ఛాలెజంజర్స్‌ బెంగళూరు నిరీక్షణకు తెరపడింది. గత 16 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫిని ఎట్టకేలకు ఆర్సీబీ ముద్దాడింది. అయితే ఆర్సీబీ అబ్బాయిలకు సాధ్యం కాని టైటిల్‌ను.. అమ్మాయిలు అందుకుని చూపించారు.  డబ్ల్యూపీఎల్‌-2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌ది కీలక పాత్ర.

అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. అంతకుముందు సెమీఫైనల్లో రెండు కీలక వికెట్లు ఆమె పడగొట్టింది. ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్‌ను అందించింది.

ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన పాటిల్‌ 13 వికెట్లు పడగొట్టి.. పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకుంది. కాగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పాటిల్‌ను ఆర్సీబీ మేనెజ్‌మెంట్‌ రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ తుది జట్టులోకి వచ్చిన శ్రేయాంక దెబ్బతిన్న సింహంలా చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఎవరీ శ్రేయాంక పాటిల్‌ను నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు.

ఎవరీ శ్రేయాంక పాటిల్‌..
21 ఏళ్ల శ్రేయాంక పాటిల్‌ బెంగళూరులో జన్మించింది.  శ్రేయాంక దేశీవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే దేశవాళీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి శ్రేయాంక అడుగుపెట్టింది.

ఇప్పటివరకు భారత్‌ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్‌.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్‌ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్‌ చేసుకుంది. కాగా పాటిల్‌ మహిళల కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ భాగమైంది. ఈ లీగ్‌లో గయానా ఆమెజాన్‌ వారియర్స్‌కు శ్రేయాంక ప్రాతినిథ్యం వహిస్తుంది.
చదవండిT20 WC: టీ20 జట్టు నుంచి అవుట్‌! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement