Ranji Trophy 2022 FInal: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Ranji Trophy 2022 Final: Sarfaraz Khan Smashes 4th Century Mum Vs MP - Sakshi

ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇప్పటికే రంజీ ట్రోపీ 2022 సీజన్‌ మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్‌ తాజాగా నాలుగో సెంచరీ అందుకున్నాడు. బెంగళూరు వేదికగా మధ్య ప్రదేశ్‌తో జరుగున్న ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక సమయంలో శతకంతో రాణించాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఓపికతో బ్యాటింగ్‌ చేసిన సర్ఫరాజ్‌ 190 బంతుల్లో శతకం మార్క్‌ను అందుకున్నాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్‌ రెండో రోజు ఆటలో 152 బంతులాడి అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్న సర్ఫరాజ్‌ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 38 బంతుల్లోనే అందుకోవడం విశేషం. సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు , ఒక సిక్సర్‌ ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో ఇప్పటికే 900 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ వెయ్యి పరుగుల మార్కను అందుకునేందుకు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాడు. కాగా ఎంతో ఓపికగా బ్యాటింగ్‌ చేసి కీలక సమయంలో సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ ఆటకు క్రికెట్‌ అభిమానులు ఫిదా అయ్యారు. 'నీ ఓపికకు సలాం.. మేము గులాం' అంటూ కామెంట్‌ చేశారు.

ఇక  248/5 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ముంబై లంచ్‌ విరామం సమయానికి  8 వికెట్లు నష్టపోయి 351 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ 119, తుషార్‌ దేశ్‌పాండే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. మధ్య ప్రదేశ్‌ బౌలర్లలో అనుభవ్‌ అగర్వాల్‌ 3, సారాన్ష్‌ జైన్‌ 2, గౌరవ్‌ యాదవ్‌ 2 వికెట్లు తీయగా.. కుమార్‌ కార్తికేయా ఒక వికెట్‌ పడగొట్టాడు.

చదవండి: అర్థ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్‌.. తొలి రోజు ముగిసిన ఆట

టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్‌ ఆత్మహత్యాయత్నం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top