
PC: PKL
Pro Kabaddi League: బెంగళూరు భారీ విజయం.. ఆరో గెలుపు
Bengaluru Bulls Record Breaking 39 Point Win: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో బెంగళూరు బుల్స్ ఆరో విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 61–22తో ఘనవిజయం సాధించింది. 39 పాయంట్లతో గెలుపొంది రికార్డు సృష్టించింది. బెంగళూరు రెయిడర్ పవన్ సెహ్రావత్ ఏకంగా 27 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. హరియాణా స్టీలర్స్, యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 36–36తో ‘టై’గా ముగిసింది.
ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం ముగిసింది. మెల్‌బోర్న్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రజ్నేశ్ 2–6, 6–7 (8/10)తో మాక్సిమిలాన్ మార్టెరర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. గంటా 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 23 అనవసర తప్పిదాలు చేశాడు.
చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు