తండ్రి కాబోతున్న క్రికెటర్‌.. కేకేఆర్‌ విషెస్‌

Pat Cummins Set To Become Father KKR Wishes To Pacer - Sakshi

కోల్‌కతా: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ తండ్రి కాబోతున్నాడు. కమిన్స్‌ ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్‌ త్వరలోనే బుల్లి కమిన్స్‌కు జన్మనివ్వనున్నారు. మదర్స్‌ డే సందర్భంగా బెకీ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘తొలి మాతృదినోత్సవం.. మినీ బంప్‌తో’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన కేకేఆర్‌.. ‘‘మదర్స్‌ డే నాడు ఎంత గొప్ప శుభవార్త చెప్పారు’’ అంటూ కమిన్స్‌- బెకీ జంటకు ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలిపింది. దీంతో కాబోయే తల్లిదండ్రులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్యాట్‌ కమిన్స్‌.. కరోనాపై భారత్‌ సాగిస్తున్న పోరులో భాగంగా తన వంతు విరాళం అందించి పెద్దమనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల కారణంగా అతడు స్వదేశానికి వెళ్లలేకపోయాడు. కాగా కమిన్స్‌ ఐపీఎల్‌ ఆడుతున్న సమయంలోనే బెకీ తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు. ‘‘ఈ సంతోషాన్ని ఇంక దాచి ఉంచటం నావల్ల కాదు. బేబీ బోస్టన్‌ కమిన్స్‌ రాబోతోంది. నిన్ను కలవడానికి మేమెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అంటూ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘మేం చాల సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాం. మేం మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి చేసుకుంటాం. అయితే, ఆలోపే ఈ చిన్నారి మా జీవితాల్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. బెకీ, బేబీ బాగున్నారు. త్వరలోనే ఇంటికి వెళ్లి వాళ్లను కలుస్తాను’’అని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో కమిన్స్‌- బెకీ నిశ్చితార్థం జరిగింది. సుమారు తొమ్మిదిన్నర మిలియన్‌ డాలర్లతో సిడ్నీలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా ఆసీస్‌ జట్టులో కమిన్స్‌ కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: ఐపీఎల్‌ 2021: ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే డబ్బు చెల్లించండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-05-2021
May 10, 2021, 08:22 IST
కోల్‌కతా: ఈ ఏడాది జూలైలో భారత జట్టు శ్రీలంక లో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో...
09-05-2021
May 09, 2021, 22:26 IST
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్‌ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి...
09-05-2021
May 09, 2021, 16:32 IST
ముంబై: దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా మహమ్మారి కారణంగా...
08-05-2021
May 08, 2021, 15:06 IST
న్యూఢిల్లీ: గత సంవత్సరం యూఏఈలో మ్యాచ్‌లు జరిపిన మాదిరిగానే భారత్‌లోనూ ఈ సారి ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాలనుకున్న బీసీసీఐ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పక్కాగా జాగ్రత్తలు...
07-05-2021
May 07, 2021, 17:29 IST
చెన్నై: సోషల్‌ మీడియా అంటేనే ట్రోల్స్‌, మీమ్స్‌కు పెట్టింది పేరు. అప్పుడప్పుడు సాధారణ వ్యక్తులు ట్రోల్‌ చేస్తూ పెట్టే కామెంట్స్‌ వైరల్‌...
07-05-2021
May 07, 2021, 16:23 IST
ముంబై: చతేశ్వర్‌ పుజారా.. సమకాలీన క్రికెట్‌లో అత్యున్నత టెస్టు ఆటగాడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు...
07-05-2021
May 07, 2021, 14:32 IST
నికోలస్‌ పూరన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌
06-05-2021
May 06, 2021, 20:33 IST
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఆటగాడు పృథ్వీ షా ప్రాచి సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నిరోజులుగా చక్కర్లు...
06-05-2021
May 06, 2021, 18:26 IST
ఢిల్లీ: సీఎస్‌కే జట్టులోని ఆటగాళ్లంతా ఇంటికి సురక్షితంగా చేరుకున్నాకే తాను ఇంటికి వెళతానని ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని...
06-05-2021
May 06, 2021, 17:10 IST
ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు తర్వాత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి స్పందించాడు. ముంబై ఇండియన్స్‌ తన...
06-05-2021
May 06, 2021, 15:50 IST
జోహన్నెస్‌బర్గ్‌ : ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల ద్వారా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎందరో పరిచయమయ్యారు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే లాంటి...
06-05-2021
May 06, 2021, 14:09 IST
ముంబై: బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ కూడా కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్‌ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి...
06-05-2021
May 06, 2021, 11:04 IST
భారత్‌లో కోవిడ్‌ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్‌ 2021కు కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా...
06-05-2021
May 06, 2021, 06:01 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను...
06-05-2021
May 06, 2021, 04:06 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి తమ...
05-05-2021
May 05, 2021, 19:30 IST
సిడ్నీ: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ స్లేటర్‌ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డాడు. కరోనా విజృంభణతో భారత్‌...
05-05-2021
May 05, 2021, 17:39 IST
ఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ 2021 రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌...
05-05-2021
May 05, 2021, 16:52 IST
చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు...
05-05-2021
May 05, 2021, 16:18 IST
లండన్‌: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం...
05-05-2021
May 05, 2021, 08:00 IST
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని వేదికగా చేసుకొని విజయవంతంగా టోర్నీని ముగించింది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top