గంభీర్‌ ఎల్లప్పుడూ దూకుడుగానే ఉంటాడు.. అతడి కెప్టెన్సీలో | IPL 2021 Pat Cummins Says His Favourite IPL Moment GG Captaincy | Sakshi
Sakshi News home page

గంభీర్‌ దూకుడుగానే ఉంటాడు.. నాకు గుర్తుండిపోయే క్షణాలు అవే!

Apr 6 2021 2:41 PM | Updated on Apr 6 2021 2:53 PM

IPL 2021 Pat Cummins Says His Favourite IPL Moment GG Captaincy - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)- 2014 టైటిల్‌ సొంతం చేసుకున్న క్షణాలే ఈ టోర్నీలో తనకు గుర్తుండిపోయిన అత్యంత మధుర జ్ఞాపకమని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అన్నాడు. తాను కోల్‌కతాకు ఆడిన తొలి సీజన్‌లోనే కప్‌ గెలవడం అమిత ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా కేకేఆర్ రూ. 15 కోట్లు వెచ్చించి కమిన్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ ఆసీస్‌ బౌలర్‌ను, 2017లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఈ క్రమంలో తాజా సీజన్‌లో మరోసారి కేకేఆర్‌ అతడిని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో.. అభిమానులతో సోషల్‌ మీడియాలో ముచ్చటించిన కమిన్స్‌ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘గౌతం గంభీర్‌.. ఓ సారథిగా ఎల్లప్పుడూ దూకుడుగానే ఉంటాడు. అతడి కెప్టెన్సీలో ఆడటాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాను. 2014లో టైటిల్‌ నెగ్గడమే నాకు ఐపీఎల్‌తో ముడిపడిన అందమైన జ్ఞాపకం అని చెప్పవచ్చు. మేం గెలిచిన మరుసటి రోజు, వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న తీరు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మంచి కెప్టెన్‌గా గంభీర్‌కు ఓటు వేసిన కమిన్స్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కమలేశ్‌ నాగర్‌కొట్టి బౌలింగ్‌ను ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.


కాగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో తొలుత నిరాశపరిచిన కమిన్స్‌, టోర్నీ ద్వితీయార్థంలో మాత్రం 14 మ్యాచ్‌లలో 12 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక కేకేఆర్‌, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఏప్రిల్‌ 11న తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక గంభీర్‌ కెప్టెన్సీలో  2012, 2014లో టైటిళ్లు గెలిచిన కేకేఆర్‌, గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అయితే, ఈసారి ఎలాగైనా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. 

చదవండి: మూడో టైటిల్‌పై కేకేఆర్‌ గురి.. అంచనాలు నిజమయ్యేనా!
అతను మీ గన్‌డెత్‌ బౌలర్‌ కాకపోవచ్చు.. కా
నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement