
బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. అయితే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.
ఈ జట్టులో ఈ సీనియర్ త్రయానికి చోటు దక్కలేదు. పాక్ కొత్త వైట్‌బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచన మేరకు వీరిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు టెస్టులు, వన్డేల్లో మాత్రమే భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇక ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, స్పీడ్ స్టార్ హ్యారిస్ రవూఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే వెటరన్ ఆటగాడు మొహమ్మద్ నవాజ్ మాత్రం సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా యువ పేస్ సంచలనం సల్మాన్ మీర్జాకు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదికగా జరగనున్నాయి.
బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్.